H3N2 Influenza : దేశంలో అలర్ట్: రెండు ఇన్ ఫ్లుయెంజా మరణాలు నమోదు..!
H3N2 Influenza : ఇప్పుడిప్పుడే జనాలు కరోనా నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో... తాజాగా హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లుయెంజా పేరిట మరో వైరస్ కలకలం రేగడం మొదలుపెట్టింది. ఇప్పటికే దేశంలో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటక,హర్యానా రాష్ట్రాల్లో ఇద్దరూ చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.
ఇప్పుడిప్పుడే జనాలు కరోనా నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో… తాజాగా హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లుయెంజా పేరిట మరో వైరస్ కలకలం రేగడం మొదలుపెట్టింది. ఇప్పటికే దేశంలో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటక,హర్యానా రాష్ట్రాల్లో ఇద్దరూ చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.
దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ వైరస్ తో బాటు తిరిగి కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయని వారు చెప్పారు. దగ్గు, జ్వరం, నీరసం, వాంతులు, శ్వాస సంబంధ వంటి రుగ్మతలతో కూడిన హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లుయెంజాతో అనేకమంది రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
వీరిలో పిల్లలు, మహిళలు, వృద్దులు కూడా ఉన్నారు. కర్ణాటకలో ఈ నెల 1 న 82 ఏళ్ళ వృద్దుడు ఈ లక్షణాలతో మరణించారు. ఇది ఈ వైరస్ సంబంధ మృతి కేసేనని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా ఆసుపత్రుల్లో విధిగా మాస్కులు ధరించాలని ఇటీవల ఆదేశించింది. పిల్లలు, 65 ఏళ్ళ వయస్సు పైబడినవారు, గర్భిణులు అనవసరమైన సభలు, సమావేశాలవంటి ‘గేదరింగ్’ లకు వెళ్లకుండా దూరంగా ఉండాలని కూడా ప్రభుత్వం సూచించింది.
ఇప్పటివరకు ఇండియాలో ఈ తరహా కేసులు 90 ఉన్నట్టు గుర్తించారు. తమ రాష్ట్రంలో 26 మంది ఈ వైరస్ కి సంబంధించి పాజిటివ్ లక్షణాల రోగులు ఉన్నట్టు తెలిసిందని, బెంగుళూరులో రెండు కేసులు బయటపడ్డాయని కర్ణాటక వైద్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.