HYD: BJP రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ & సోషల్ మీడియా విభాగాల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పాల్గొన్నారు. లీగల్ మార్గదర్శకాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజమైన సమాచారం చేరవేయడం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో BJP బలపడేందుకు ప్రతి కార్యకర్త బాధ్యత యుతంగా పనిచేయాలన్నారు.