»Centers Key Announcement On The Outbreak Of H3n2 Virus
H3N2 Virus :హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిపై కేంద్రం కీలక ప్రకటన
కరోనా(Corona) తగ్గిపోయిందని అందరూ అనుకున్న టైంలో ఇప్పుడు మరో వైరస్ అందర్నీ భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో గత కొన్ని రోజుల నుంచి హెచ్3ఎన్2 వైరస్(H3N2 Virus) వ్యాప్తి ఎక్కువవుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే రెండు మరణాలు సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

హెచ్3ఎన్2 వైరస్(H3N2 Virus) అనేది ఇన్ ఫ్లుయెంజా వైరస్ సబ్ వేరియంట్ అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పిల్లలు, అనారోగ్యంతో ఉన్న వృద్ధులు ఈ హెచ్3ఎన్2(H3N2) వైరస్ బారిన త్వరగా పడే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఈ వైరస్(Virus) భారత్ కు కొత్తది కాదని, దేశంలో ప్రతి ఏడాది రెండు సార్లు దీని వ్యాప్తి కనిపిస్తూ ఉంటుందని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని సార్లు చూస్తే ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ మార్చి చివరి తేదికల్లా ఈ కేసులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
డబ్ల్యూహెచ్ఓ(WHO) సూచన మేరకు ఈ వైరస్ బారిన పడిన వారు ”ఒసెల్టామివిర్” అనే డ్రగ్ వాడాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ డ్రగ్ అన్ని ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా లభించనున్నట్లు తెలిపింది. అనవసరమైన యాంటీబయోటిక్స్ వాడొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది.