»Manish Sisodia Had Direct Role In Delhi Liquor Scam Ed
liquor scamలో మనీశ్ సిసోడియాది ప్రత్యక్ష పాత్ర: కోర్టుకు తెలిపిన ఈడీ
Manish Sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) మనీశ్ సిసోడియాది (manish sisodia) ప్రత్యక్ష పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. కొందరి వ్యక్తిగత ప్రయోజనం కోసం లిక్కర్ పాలసీ రూపొందించారని పేర్కొంది. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోకుండానే హోల్‌సేల్ (wholesale) వ్యాపారులకు 12 శాతం లాభం చేకూర్చేందుకు పాలసీ రూపొందించారని వివరించింది.
Manish Sisodia had direct role in Delhi liquor scam: ED tells court
Manish Sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) మనీశ్ సిసోడియాది (manish sisodia) ప్రత్యక్ష పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. సిసోడియాను కోర్టులో హాజరుపరిచిన ఈడీ.. 10 రోజుల రిమాండ్‌కు ఇవ్వాలని కోరింది. కొందరి వ్యక్తిగత ప్రయోజనం కోసం లిక్కర్ పాలసీ రూపొందించారని పేర్కొంది. నాయర్, సిసోడియా, కవిత సహా పలువురు కుట్ర చేశారని కోర్టుకు తెలిపారు. ఆప్ నేతలకు సౌత్ గ్రూపు నుంచి రూ.100 కోట్ల ఇచ్చిందని.. ఢిల్లీలో 30 శాతం మద్యం వ్యాపారాన్ని సౌత్ గ్రూపునకు ఇచ్చిందని ఈడీ పేర్కొంది. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోకుండానే హోల్‌సేల్ (wholesale) వ్యాపారులకు 12 శాతం లాభం చేకూర్చేందుకు పాలసీ రూపొందించారని వివరించింది. లిక్కర్ స్కామ్‌లో (liquor scam) అరెస్టైన మనీశ్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
మనీశ్ సిసోడియాను (Manish Sisodia)14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి (judicial custody) తరలించిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్‌లో (liquor scam) ఫిబ్రవరి 26వ తేదీన మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27వ తేదీన సిసోడియాను కోర్టులో (court) ప్రవేశపెట్టగా 5 రోజుల (5 days) కస్టడీ విధించింది. తర్వాత కోర్టుకు తీసుకెళ్లగా మరో రెండు రోజులు కస్టడీ ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో మరోసారి కోర్టుకు తరలించారు. ఈ సారి కస్టడీ కాకుండా జ్యుడిషీయల్ రిమాండ్ కోరారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బెయిల్ కోసం మనీశ్ సిసోడియా దరఖాస్తు చేశారు.
లిక్కర్ స్కామ్‌లో సీబీఐ (CBI) అరెస్ట్‌ల పరంపర కొనసాగుతుంది. కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu)ను అరెస్ట్ చేశారు. ఆయనకు షరతులో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (magunta srinivasulu reddy) కుమారుడు రాఘవ (raghava) ఉన్నారు. కవిత సౌత్ గ్రూప్‌ను మెయింటెన్ చేశారని.. రూ.150 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే రేపు కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు.