ASR: “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ప్రారంభ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో అరకులోయలో నేడు నిర్వహించనున్నట్లు అరకులోయ ఎంపీడీవో లవరాజు తెలిపారు. ఈ పధకానికి అరకులోయ మండలంలో 394 మంది (ఆటో/క్యాబ్ డ్రైవర్లు) అర్హులైనట్లు తెలిపారు. ఈ పథక ప్రారంభోత్సవానికి ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ ప్రసాద్ హాజరుకానున్నట్లు తెలిపారు.