WNP: చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతయిన ఘటన శుక్రవారం మదనాపురం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. కొత్తకోటకు చెందిన శేఖర్ (40) మండల పరిధిలోని సరళా సాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న నీటిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.