NZB :శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 800 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇంకా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి 33 వరద గేట్ల ద్వారా లక్షా 75 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం పెంచడానికి అధికారులు ఔట్ ఫ్లోను తగ్గించారు.