BDK: దుర్గమ్మ చిన్న విగ్రహాలు విజయవంతంగా శుక్రవారం నిమజ్జనం అయ్యాయి. పెద్ద విగ్రహాల కోసం అధికారులు క్రేన్, లాంచీ ఏర్పాట్లు చేసి భక్తుల సౌకర్యార్థం సజావుగా నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాలు భక్తిశ్రద్ధలు ఆనందోత్సాహాల నడుమ భక్తులు ఊరేగింపు చేపట్టారు. అమ్మవారి విగ్రహాలు భద్రాచలం గోదావరి నది ఒడికి చేరుకున్నాయి.