SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ మృతి చెందడంతో ఆయన అంతక్రియల కోసం విద్యుత్ శాఖ తరపున రూ. 30 వేల ఆర్థిక సాయంను మృతుడి భార్య సౌమ్యకు అందజేసినట్లు ఏఈ శోభారాణి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మృతితో విద్యుత్ శాఖకు తీరని లోటు అన్నారు.