AKP: నర్సీపట్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 11 వ తారీకు నుంచి నాలుగు రోజులు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ తాటికొండ బ్రహ్మ లింగేశ్వర స్వామి తెలిపారు. పవిత్రోత్సవాల కరపత్రాలను శనివారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులతో ఆయన ఆవిష్కరించారు. భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.