RR: తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కందుకూరు మండలానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు కవిత నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.