W.G: ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలని, రైస్ మిల్లర్ల నుండి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని జేసి రాహుల్ అన్నారు. కలెక్టరేట్లో మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, వివాదాలకు తావు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.