SKLM: పోలాకి మండలం రాళ్లపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు ఎండిపోయిన తాటిచెట్టు విరిగిపడటంతో బోర నీలం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు అతన్ని శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, బాధితుడు ప్రస్తుతం కోమాలో ఉన్నాడు, పరిస్థితి విషమంగా ఉంది.