MDK: భారీ వర్షాల కారణంగా రద్దైన మెదక్ నుంచి కాచిగూడ రైల్వే సర్వీస్‌ను రైల్వే శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. ఆగస్టు 27న వర్షాలకు మెదక్-అక్కన్నపేట మార్గంలో రైల్వే ట్రాక్ కట్ట కొట్టుకుపోయింది. మరమ్మతులు పూర్తి చేసి, రోజువారిగానే రైలు ప్రయాణాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం కలుగుతుంది.