అన్నమయ్య: ఓబులవారిపల్లి(M) మంగంపేటలోని ఏపీఎండీసీ మోడల్ స్కూల్లో సెక్యూరిటీ గార్డ్ రవితేజ (27) శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పాఠశాలకు చేరుకున్నాక ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చాడు. నీటి పంపు మోటారు ఆన్ చేయడానికి వెళ్లగా కుప్పకూలిపోవడంతో వేంటన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.