ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్రం స్వల్ప ఊరట కల్పించింది. జాతీయ రహదారులపై ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఫాస్టాగ్ ఉన్నవారు రూ.100 చెల్లిస్తే, ఫాస్టాగ్లేని వారు నగదు రూపంలో రూ.200, యూపీఐ ద్వారా అయితే రూ.125 చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తాయి.