ASR: భారీ వర్షాలకు జీ.మాడుగుల మండలంలోని వనభంగిపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం శుక్రవారం కూలిపోయింది. రాత్రి సమయంలో భవనం కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. పాఠశాలలో సుమారు 37 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని స్థానికులు తెలిపారు. పాఠశాల భవనం కూలిపోవడంతో వారికి ఇబ్బందులు తప్పవన్నారు. నూతన పాఠశాల భవనం నిర్మించాలని కోరుతున్నారు.