KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామ సమీపంలోని ఫుడ్ అండ్ సైన్స్ కళాశాల వద్ద శుక్రవారం క్యారీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయినట్లు సీఐ హాజీవలి తెలిపారు. అనంతపురం జిల్లా లింగారెడ్డిపల్లెకు చెందిన నాగరాజు కుటుంబ సభ్యులు మొక్కుబడి తీర్చుకునేందుకు పొలతలకు వెళ్తుండగా టైరు పంచర్ అవడంతో ఆటో బోల్తా పడిందన్నారు.