HYD: ప్రయాణికుడి సెల్ ఫోను తస్కరించిన ఆటో డ్రైవర్ ఫోన్ పే ఆధారంగా ఖాతా ఖాళీ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా..హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తార్నాక వెళ్తున్న క్రమంలో డ్రైవర్ మొయినుద్దీన్ బాధితుడు ఫోన్ తస్కరించి రూ.1.95 లక్షలు కాజేశారు.