NLR: నెల్లిమర్ల MRO శ్రీకాంత్ శుక్రవారం ఆయన కార్యాలయంలో డిప్యూటీ MRO జగన్నాదరావుతో కలసి మండలానికి చెందిన పలువురు రాజకీయ పార్టీల వాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని అన్నారు.