KMR: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల కొనసాగుతుంది. శనివారం ప్రాజెక్టులోకి 1,03,689 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తేశారు. ప్రస్తుతం మంజీరాలోకి 52,182 క్యూసెక్కులు, ప్రధాన కాలువలోకి 900 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.17.152/17.802 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరుకుంది.