VSP: అరకు కాఫీ ద్వారా జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించుకున్న గిరిజన సహకార సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో ఈ అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారిని ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో ప్రశంసించారు.