TG: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. తన సతీమణి, TGIIC ఛైర్పర్సన్ నిర్మలారెడ్డిని బరిలో నిలుపుతానని ప్రకటించారు. మరో పదేళ్ల తర్వాత ఎన్నికల్లో పోటీపై ఆలోచన చేస్తానన్నారు. తనకు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందించిన సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకొస్తానని పేర్కొన్నారు.