కడప: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత శనివారం కమలాపురం రానున్నట్టు TDP వర్గాలు శుక్రవారం తెలిపాయి. కూటమి ప్రభుత్వం శనివారం ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేయనుంది. కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆమె రానున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్,TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, MLA చైతన్య రెడ్డి పాల్గొననున్నారు.