AP: సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. విజయవాడలోని ధర్నాచౌక్లో మధ్యాహ్నం 1 గంట నుంచి ఆందోళన నిర్వహించనున్నారు. అన్ని స్పెషాలిటీల్లో కలిపి 15 శాతం ఇన్ సర్వీసు పీజీ కోటా ఒక్క ఏడాది వర్తింపజేస్తామని అధికారులు వెల్లడిస్తే.. మూడేళ్లు కావాలని, అదీ లిఖితపూర్వకంగా అంగీకరిస్తేనే విధులకు హాజరవుతామని వైద్యులు పట్టుబట్టారు.