గాజా శాంతి ప్రణాళికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు అల్టిమేటం జారీ చేశారు. US కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3:30) 20 పాయింట్ల శాంతి ఒప్పందాన్ని అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఒప్పందాన్ని అంగీకరించకపోతే.. ఎవరూ ఊహించని విధంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు.