NZB: లండన్లో ఉంటున్న నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్, మెండోరా, మండలాలకు చెందిన ఎన్నారైలు శుక్రవారం రోజు ఘనంగా బతుకమ్మ, దసరా పండగలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ.. దేశం దాటిన సాంప్రదాయాలు, పద్ధతులు మరువలేమని బతుకమ్మ, దసరా పండగల చరిత్ర ను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందంగా సంబరాలు చేసుకొన్నామని తెలిపారు.