NLG: మునుగోడు మండలంలోని సీపీఎం కార్యాలయంలో నిన్న నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఐ(ఎం) సిద్ధంగా ఉందని తెలిపారు.