KNR: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టేపల్లి శివారులో లారీ డ్రైవర్ అజాగ్రత్తతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ ముందున్న ఓ కారును ఢీ కొట్టి, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 కార్లు ధ్వంసమవగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.