Ramesh Agarwal : ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ తండ్రి కన్నుమూత
ఓయో(Oyo) వ్యవస్ధాపకుడు రితేశ్ అగర్వాల్ (Ritesh Agarwal) ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. రితేశ్ తండ్రి రమేశ్ అగర్వాల్ (Ramesh Agarwal)మరణించారు. గురుగ్రామ్ (Gurugram) లోని తన ఇంట్లోని 20వ అంతస్తు నుంచి కిందపడి ఆయన మృతి చెందారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే రితేశ్ పెళ్లి (Wedding) ఘనంగా జరిగింది. ఇంతలోనే ఆయన ఇంట్లో విషాదం అలుముకుంది.
ఓయో(Oyo) వ్యవస్ధాపకుడు రితేశ్ అగర్వాల్ (Ritesh Agarwal) ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. రితేశ్ తండ్రి రమేశ్ అగర్వాల్ (Ramesh Agarwal)మరణించారు. గురుగ్రామ్ (Gurugram) లోని తన ఇంట్లోని 20వ అంతస్తు నుంచి కిందపడి ఆయన మృతి చెందారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే రితేశ్ పెళ్లి (Wedding) ఘనంగా జరిగింది. ఇంతలోనే ఆయన ఇంట్లో విషాదం అలుముకుంది. రమేష్ అగర్వాల్ 20వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి మరణించినట్టు తమకు సమాచారం అందిందని గురుగావ్ ఈస్ట్ డీసీపీ తెలిపారు. ఆ సమయంలో ఆయన భార్య, కుమారుడు రితేష్ అగ్వారాల్, కోడలు గీతాన్ష్ సూద్ ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామన్నారు. మరణానికి దారితీసిన పరిస్థితులపై రమేష్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని తెలిపారు.
కాగా..రితేష్ అగర్వాల్‌కు ఇటీవల ఫార్మేషన్ వెంచర్స్(Formation Ventures) డైరెక్టర్ గీతాన్ష సూద్‌తో వివాహం కాగా ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.ఈ రిసెప్షన్‌కు బిలియనీర్ ఇన్వెస్టర్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఫౌండర్ మసయోషి సాన్, సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) ప్రముఖ స్టార్టప్ ఫౌండర్లు, ఇన్వెస్టర్లు కూడా హాజరయ్యారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. తమకు మార్గదర్శి, నిరంతరం స్ఫూర్తి రగిలించే తండ్రి రమేశ్ అగర్వాల్ ఈరోజు మరణించారని భారమైన హృదయంతో తానూ, తన కుటుంబం వెల్లడిస్తున్నామని రితేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
నా తండ్రి మరణం నా కుటుంబానికి తీరని లోటు అని రితీశ్ అగర్వాల్ (Ritesh Agarwal) తెలిపారు. “నాకు, నా కుటుంబానికి ఆశాజ్యోతి, బలం నాన్నగారే. ఆయన ఈరోజు కన్నుమూయడం మమ్మల్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. నాన్నగారు పూర్తి జీవితం గడిపారు. ప్రతిరోజు నాతో పాటు ఎందరెందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన లేని లోటు మా కుటుంబానికి ఎప్పటికీ తీరదు. ఒడిదుడుకుల్లోనూ నాన్నగారు ఎంతో నిబ్బరంగా ఉండటం మేము చూశాం. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తాం. ప్రస్తుత విషాద సమయంలో ప్రతి ఒక్కరూ తమ ప్రైవసీని (Privacy) గౌరవించాలని కోరుకుంటున్నాం” అని ఆ ప్రకటనలో రితేష్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.