»Hot At Across India In This Summer Kerala Record This March 54 Degrees
Summer beginలోనే మండుతున్న ఎండలు.. కేరళలో అప్పుడే 54 డిగ్రీలు
Hot summer:మార్చి వచ్చింది.. కొన్ని చోట్ల వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఎండ వేడిమి ఉంది. ఉదయం 10 దాటితే చాలు భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. దైవభూమి కేరళలో రికార్డు స్థాయిలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంది.
Hot at across india in this summer, kerala record this march 54 degrees
Hot summer:మార్చి వచ్చింది.. కొన్ని చోట్ల వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఎండ (hot) వేడిమి ఉంది. ఉదయం 10 దాటితే చాలు భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. దైవభూమి కేరళలో (kerala) రికార్డు స్థాయిలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా చోట్ల కూడా ఎండ (heat) ప్రభావం ఉంది. ఈ సారి అన్నీ చోట్ల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ (weather) శాఖ చెబుతోంది. సో.. బయటకు వెళ్లేప్పుడు విధిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కేరళలో (kerala) పచ్చదనం ఎక్కువే. కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ పచ్చదనం ఉట్టిపడుతుంది. అయితే అక్కడ కూడా హై టెంపరేచర్ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గల కొన్ని ప్రాంతాల్లో గురువారం 54 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యిందట. ఇలా అయితే వడ దెబ్బ (sun stroke) తగిలే అవకాశం ఉంటుందని వైద్యులు (doctors) సూచిస్తున్నారు. సో.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మార్చిలోనే 50 డిగ్రీలు నమోదైతే.. ఇక ఏప్రిల్, మే సంగతి ఏంటి అనే భయం వెంటాడుతుంది.
తిరువనంతపురం జిల్లా అలప్పుజా, కొట్టాయం, కన్నూరు జిల్లాలో 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందట. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్‌లో గురువారం 45 నుంచి 54 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైందని కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. ఇక్కడ 40 నుంచి 45 డిగ్రీల కన్నా టెంపరేచర్ మించదట.. కానీ ఈ సారి హై టెంపరేచర్ నమోదవుతోంది.
అధిక ఉష్ణోగ్రత నమోదయితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే పంటకు కూడా నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. దేశవ్యాప్తgగా ఫిబ్రవరిలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని అంటున్నారు. 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుందని.. కానీ 7.1 మి.మీ వర్షపాతమే నమోదయ్యిందని చెబుతున్నారు. 68 శాతం తగ్గిందని వివరించారు.