సాధారణంగా పాము (Snake) పేరు వింటేనే వణుకు పడుతుంది. ఇక పామును చూస్తే పరుగులు పెట్టాల్సిందే. అయితే చాలామంది ఇలా పాములను చూసి భయపడే వారే ఉంటారు. కానీ కొందరు మాత్రం పాములను సైతం ప్రేమిస్తుంటారు.. చక్కగా వాటిని కన్నబిడ్డలా లాలిస్తూ ఉంటారు. కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని కమాన్ ప్రాంతంలో ఓ పాము గాయాలతో పడి ఉన్నట్లు జంతువుల నిర్వాహకురాలు శ్రీ లక్ష్మి(Shri Lakshmi)కి సమాచారం అందింది. దీంతో ఆ పామును జంతు సంరక్షణ సిబ్బంది కరీంనగర్ పశువైద్యశాలలోకి తీసుకెళ్లి చికిత్స చేశారు. గాయపడిన పాముకు వైద్యులు కుట్లు వేశారు.
పాము కోలుకున్న తర్వాత దాన్ని అడవిలో వదిలేస్తామని వైద్యులు (Doctors)వెల్లడించారు. గాయపడిన పాముకు జంతువుల నిర్వాహకురాలు చికిత్స అందించింది. గాయాలైన చోట అచ్చం మనిషికి చేసినట్టే కుట్టు వేసి.. బ్యాండేజీ (Bandage)వేసింది. పాముకు రెస్ట్ కావాలని.. అది కోలుకున్న తర్వాత తిరిగి దాన్ని అడవిలో వదిలేస్తానని తెలిపింది. ఆధునిక సాంకేతిక యుగంలో విష సర్పాలకు కూడా మెరుగైన వైద్య విధానం అందుబాటులోకి రావడంతో వైద్యులు సర్పాలకు కూడా అరుదైన చికిత్సలు చేస్తున్నారు. అయితే వైద్యుడికి కేవలం చికిత్సపై అవగాహన.. అనుభవం ఉంటే మాత్రమే సరిపోదు.. పాముకు శస్త్ర చికిత్స చేయాలి అంటూ గుండెనిబ్బరం కూడా చాలా అవసరం..