రోడ్డు ప్రమాదల (Road accident)పై చాలామందికి అవగాహన రహదారి దాటుతూ బస్సు చక్రాల కింద నలిగిపోతున్నారు. దానికి విరుగుడుగా ఆర్టీసీ బస్సు ముందుభాగంలోని ‘కనపడని ప్రాంతం’డ్రైవర్‌కు కనిపించేలా ప్రత్యేకంగా మిర్రర్(Especially the mirror) ఏర్పాటు చేస్తోంది. ఆర్టీసీ బస్సు (RTC bus) దిగిన భార్యాభర్తలు మరో బస్సు ఎక్కాలన్న ఆత్రుతలో దిగిన బస్సు ముందు నుంచే రోడ్డు దాటబోయారు. వారు రోడ్డు దాటుతున్నది కనిపించక బస్సు డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సు తగిలి ఇద్దరూ కింద పడిపోగా బస్సు చక్రాలు వారిని చిదిమేశాయి. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్(Secunderabad)లో జరిగిన దుర్ఘటన అక్కడి వారిని కలిచివేసింది. బస్సు డ్రైవర్‌కు కొన్ని కోణాల్లో ముందున్న ప్రాంతం కనిపించదు. అందులో ముఖ్యమైంది బస్సు ముందు దాదాపు మూడునాలుగు అడుగుల స్థలం. దాన్నే బ్లైండ్స్పాట్గా చెబుతారు. తక్కువ ఎత్తున్న వారు, బస్సు రేడియేటర్ (Radiator) ముందు నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లేవాళ్లు ఆ ప్రాంతంలో బస్సును దాటుతున్నప్పుడు వారిని గుర్తించటం డ్రైవర్‌కు సాధ్యం కాదు.