క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ (cm jagan)తో భేటీ అయినప్పుడు రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. కానీ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. అది ఏ ఫ్లాట్ ఫామ్ అనేది త్వరలో చెబుతానని రాయుడు తెలిపారు గుంటూరు(Guntur)నుంచి ఎంపీగా పోటీ చేస్తాననేది ఊహాగానమేనని అన్నారు. క్షేత్ర సాయిలో ప్రజా, రైతు సమస్యలు తెలుసుకుంటున్నానని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టం చేశారు.ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేరు కీలకంగా వినిపించింది. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు భారత క్రికెట్ జట్టులో సేవలందించారు.
దాదాపు 55 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం క్రికెట్(Cricket)కు గుడ్ బై చెప్పిన ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. అలా జరిగినట్టుగానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో రెండు సార్లు భేటీ అయ్యారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తనకు సరిపోయే నియోజకవర్గాన్ని సూచించాల్సింది తన అభిమానులను, శ్రేయోభిలాషులను అంబటి రాయుడు కోరినట్లు వార్తలు వచ్చాయి.
తమ పార్టీలోకి రావాలని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Tota Chandrasekhar) అంబటి రాయుడిని కోరినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ అంబటి రాయుడి మిత్రుడితో ఆ విషయాన్ని ప్రస్తావించి అందుకు ఒప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, తనను ఎవరూ సంప్రదించలేదని, ప్రజలతో సమావేశమైన తర్వాతనే తాను నిర్ణయం తీసుకుంటానని అంబటి రాయుడు తో చెప్పారు. అంబటి రాయుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన(Janasena)లో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.38 ఏళ్ల వయస్సు గల అంబటి రాయుడు ఈ ఐపిఎల్ (IPL) సీజన్ తర్వాత పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకుని రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు.