»Breaking Five People Died In A Road Accident Seven Were Seriously Injured
Breaking: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం..ఏడుగురికి తీవ్ర గాయాలు!
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఐదుగురు దుర్మరణం(5 died) చెందిన సంఘటన జమ్మూకశ్మీర్లో చోటుచేసుకుంది. మంగళవారం జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలు(7 Injured) అయ్యాయి. భదర్వా, పఠాన్ కోట్ రహదారిపై ఈ ప్రమాదం(Accident) జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు.
గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకునే సరికే ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు దోడా ఎస్పీ అబ్దుల్ ఖయూమ్ తెలిపారు. ప్యాసింజర్ వాహనం కథువా జిల్లాలోని బనీ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.