AMAZON : అమెజాన్‌లో ఏదో ఆర్డర్ చేస్తే డెలివరీలో పాము వచ్చింది!
ఆన్లైన్లో ఏం ఆర్డర్ ఇస్తే ఏం వస్తున్నాయో ప్రజలకు అర్థమే కావడం లేదు. వింత వింత వస్తువులు డెలివరీ వస్తుండటం చూశాంగానీ ఓ బెంగళూరు జంటకు ఏకంగా డెలివరీలో పాము వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AMAZON : ఆన్లైన్ షాపింగ్ ఇటీవల కాలంలో కొంత మందికి చేదు అనుభవాలను మిగులుస్తోంది. వింత వింత వస్తువులు డెలివరీ రావడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఓ బెంగళూరు జంటకు మాత్రం ఏకంగా బతికున్న నాగుపాము డెలివరీ బాక్సులో వచ్చింది. దీంతో వారు ఎంతగానో భయాందోళనలకు గురయ్యారు. ఇంతకీ వీరు అసలు ఏం ఆర్డర్ చేశారంటే..?
బెంగళూరులోని సార్జాపూర్ రోడ్డుకు చెందిన ఓ జంట గేమింగ్‌కి ఉపయోగించే ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ని అమెజాన్‌లో ఆర్డర్ (AMAZON ORDER) పెట్టారు. దానికి సంబంధించిన డెలివరీ వచ్చింది. వారు సాధారణంగా బాక్సును ఓపెన్ చేయబోయారు. ఎందుకైనా మంచిదని వీడియో తీస్తూ బాక్సులు ఓపెన్ చేశారు. కాస్త తెరిచే సరికి అందులో కదులుతున్న పాము కనిపించింది. అది బతికి ఉంది. పైగా విషపూరితమైన నాగుపాము. దీంతో వారు అవాక్కయ్యారు.
ఈ పాము కదులుతున్నప్పుడు అదృష్టవశాత్తూ అమెజాన్ ప్యాకింగ్ టేప్‌కి అంటుకుపోయింది. దీంతో అది బయటకు వచ్చి ఎవరికీ ఏమీ హాని కలిగించలేదు. దీంతో ఆ దంపతులు ఖంగు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల ఇలంటి చిత్రమైన ఘటనలే వెలుగు చూశాయి. ముంబయిలో ఓ వ్యక్తి ఐస్‌క్రీం ఆర్డర్ చేయగా అందులో వేలు ఉంది. మరో పార్శిల్లో జర్రి దర్శనం ఇచ్చింది. మీకూ డెలివరీలు వస్తున్నాయి. ఎందుకైనా మంచిది అప్రమత్తంగా దాన్ని తెరవండంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
In a shocking incident, a family on Sarjapur Road received a live Spectacled Cobra (venomous snake) with their Amazon order for an Xbox controller.