»Snake In Japan Bullet Train Journey Delayed By 17 Minutes
Bullet Train: జపాన్ బుల్లెట్ ట్రైన్లో పాము.. ప్రయాణం ఆలస్యం
ప్రపంచంలోనే వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణించింది. దీనికి కారణం రైలులో పాము రావడమే. దీంతో ప్రయాణీలు కంగారు పడడంతో ట్రైన్ మార్చాల్సి వచ్చింది.
Snake in Japan bullet train.. journey delayed by 17 minutes
Bullet Train: బుల్లెట్ ట్రైన్ అనగానే అందరికి జపాన్ గుర్తుకు వస్తుంది. అయితే అలాంటి ట్రైన్ ఇప్పటివరకు ఎప్పుడు ఆలస్యం అవలేదు అంటే అతిశయోక్తి కాదు. కానీ అలాంటి రైలు తాజాగా 17 నిమిషాలు ఆలస్యం అయింది. ఈ విషయం తెలిసిన జపాన్ ప్రజలు ఆశ్యర్యపోయారు. ఎందుకంటే 1964 ఆక్టోబర్ 1 న అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి 0.2 నిమిషాలు మాత్రమే అలస్యంగా వచ్చింది. ఇప్పుడు ఏకంగా 17 నిమిషాలు అయితే దీనికి కారణం సాంకేతిక లోపము కాదు, ట్రైనులోకి పాము వచ్చింది. దీంతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులందరినీ మరో ట్రైన్లో తమ గమ్యస్థానాలకు చేరవేశారు. దీంతో ట్రైన్ ఆసల్యం అయింది. చిన్న పాముకే ట్రైన్ మారాలంటే జపాన్‌లో మనుషులకు అంత విలువ ఉంటుంది. విషయంలోకి వెళితే..
నగోయా నుంచి టోక్యో వెళ్లే బుల్లెట్ రైల్లో మంగళవారం సాయంత్రం ఓ 40 సెంటీమీటర్ల చిన్న పామును ప్యాసింజర్ ఒకరు గమనించారు. ఇదే విషయాన్ని భద్రతా సిబ్బందికి చెప్పడంతో ప్రయాణికులను మరో రైల్లోకి తరలించి గమ్యస్థానం చేర్చారు. ఇలా రైల్లోకి పాము రావడం కూడా ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. మాములుగా జపాన్ రైల్వే నిబంధనల ప్రకారం చిన్న కుక్కలు, పిల్లులు, పావురాలు వంటి వాటికి అనుమతి ఉంది కానీ పాములకు లేవు. అయితే పామును ఎవరన్నా కావాలనే తీసుకొచ్చారా, లేదా అనుకోకుండా వచ్చిందా అనేది తెలియదు. గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్లు పాము రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.