»At Least 58 Killed By 2 Weeks Of Floods In Tanzania
Tanzania : టాంజానియాలో వరదల విధ్వంసం.. 58 మంది మృతి
టాంజానియాలో రెండు వారాలుగా వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వీటి వల్ల లక్షల మంది నిరాశ్రయులు కాగా 58 మంది మరణించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
floods in Tanzania : ఆఫ్రికా దేశం టాంజానియాలో గత రెండు వారాలుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో అక్కడ కనీసం ఇప్పటి వరకు 58 మంది మరణించారు. ఈ వర్షాలు, వరదల ప్రభావం వల్ల సుమారు లక్షా 26 వేల మంది ప్రభావితం అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. బాధితులందరికీ ఆహారం, నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది.
టాంజానియాలో భవిష్యత్తులో వరదలు రాకుండా ఉండేందుకు 14 ఆనకట్టల్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి మోభరే మతినీ తెలిపారు. తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరో పక్క కెన్యాలోనూ వరదల వల్ల ఇప్పటి వరకు 13 మంది మరణించారు. అక్కడ కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
గత ఏడాది అంటే 2023లో ఎల్నినో ఉద్భవించింది. దీని వల్ల సాధారణంగానే ప్రపంచ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా కరువు కాటకాలు, భారీ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.