నేడు ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ 59వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన ఓ పోస్టర్ను విడుదల చేసింది. కాగా, ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి’ సాంగ్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది.