Meta layoffs మరిన్ని.. అనవసరం అనిపిస్తే ఇక బూస్టింగే
Meta layoffs:కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కంపెనీలు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అందుకే ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఒక కంపెనీ చూసి.. మరో కంపెనీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ‘మెటా’ (meta) మరికొందరినీ పంపించే పనిలో ఉంది.
Meta layoffs:కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కంపెనీలు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అందుకే ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఒక కంపెనీ చూసి.. మరో కంపెనీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ‘మెటా’ (meta) మరికొందరినీ పంపించే పనిలో ఉంది. అవసరం లేని వారి జాబితాను రూపొందించి పంపించాలని డైరెక్టర్లకు (directors) వైస్ ప్రెసిడెంట్లకు (vice presidents) ఆదేశాలు జారీచేసింది.
తమ కంపెనీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు లే ఆఫ్స్ (lay offs) తప్పడం లేదని మెటా (meta) చెబుతోంది. రెండో విడత చేపట్టే లే ఆఫ్స్ వల్ల అయిన లక్ష్యాలను చేరుతామని భావిస్తోంది. కంపెనీ నిర్ణయంతో వేలాది మంది (thousand employees) ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ‘బ్లూమ్‌బర్గ్ న్యూస్’ రిపోర్ట్ చేసింది. ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించే మెటా (meta).. ఇప్పుడు మెటావర్స్‌పై ఫోకస్ చేసిందని నివేదిక పేర్కొంది. కంపెనీకి డబ్బు ఆదా కావాలి.. సో అందుకే ఉద్యోగాల తొలగించాలని (lay offs) అనుకుంటున్నారు. ఉద్యోగులే కాదు కొందరు కంపెనీ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లను కూడా తీసివేయాలని అనుకుంటుందట.
ఇటీవల కంపెనీ మేనేజర్లు తమ 10 శాతం (10 per cent) ఉద్యోగులకు ‘మీట్స్ మోస్ట్’ (meets most) అని రేటింగ్ ఇచ్చింది. ఇదీ సంస్థలో రెండో దిగువ రేటింగ్.. లోయెస్ట్ రేటింగ్ ‘మీట్స్ సమ్’ (meets some) అంటే ఇదీ రెగ్యులర్ రేటింగ్ కాదు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా రేటింగ్ ఇస్తుంటారు. లోయస్ట్ రేటింగ్ ఉన్న ఉద్యోగులు త్వరలో కంపెనీ వీడే అవకాశం ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో పేర్కొంది. అప్పటికే కొందరు ఉద్యోగులకు సమాచారం ఇస్తుందని.. అయితే వారు సొంతంగా జాబ్ వదలకుంటే మరో రౌండ్ లే ఆఫ్స్ చేపడుతుందని పేర్కొంది.
తక్కువ రేటింగ్ వచ్చినవారికి అదీ ప్రతికూలంగా మారుతుంది. కొత్త ఉద్యోగం (new job) కోసం ఇంటర్వ్యూ ఫేజ్ చేసిన సమయంలో జాబ్ (job) దొరకడం కష్టం అవుతుంది. కానీ మెటా (meta) మాత్రం తన ఖర్చులను తగ్గించుకోవాలని అనుకుంటుంది.