»Google Bard Launched In India Heres How To Access It
Google Bard Launched: భారత్ లో గూగుల్ బార్డ్..ఏంటిది? దీని ఉపయోగం ఏంటి?
గూగుల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ఐఓ 2023 కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణను విడుదల చేసింది. ఈ వేదికపైనే ఏఐ టూల్ గూగుల్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ బార్డ్ ను భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.
ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ‘బింగ్ చాట్’ ను పరిచయం చేయగా, తాజాగా గూగుల్ కూడా తన ‘బార్డ్’ టూల్ ను గూగుల్ ఏఐ 2023 సదస్సులో ఆవిష్కరించింది. గూగుల్ ‘బార్డ్’ ను ఉపయోగించడం సులువే. బ్రౌజర్ లో ‘గూగుల్ బార్డ్’ అని టైప్ చేస్తే… గూగుల్ బార్డ్ కి సంబంధించిన అనేక అంశాలు సెర్చ్ రిజల్ట్స్ లో ప్రత్యక్షమవుతాయి. అందులోకి లాగిన్ అవ్వాలంటే జీమెయిల్ అకౌంట్ ఉండాల్సిందే. టర్మ్స్ అండ్ కండిషన్స్ కు ఒప్పుకుంటున్నట్టు ఐ అగ్రీ అనే బటన్ నొక్కితే ‘బార్డ్’ పేజి తెరుచుకుంటుంది. మన ఓపిక ఉన్న కొద్దీ ఎంత సమాచారం కావాలంటే అంత సమాచారం దీన్నుంచి పొందవచ్చు. సమాచారం పొందడానికి ఎలాంటి పరిమితి లేదు. టెక్ట్స్ రూపంలో మనకు కావాల్సిన వివరాలను బార్డ్ అందిస్తుంది. ‘బార్డ్’ ద్వారా పొందే సమాచారాన్ని మనం ఇతరులతోనూ పంచుకోవచ్చు.
ఒకవేళ ‘బార్డ్’ తప్పుడు సమాచారం ఇస్తే… రిపోర్ట్ లీగల్ ఇష్యూ అనే ఆప్షన్ ద్వారా గూగుల్ కు నివేదించవచ్చు. అయితే, తొలుత ఇంగ్లీషులోనే ‘బార్డ్’ తో చాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇతర భాషల్లోనూ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. గత మార్చిలో వినియోగదారుల కోసం బార్డ్ ఏఐ పబ్లిక్ యాక్సెస్ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో, బార్డ్ యూకే, అమెరికాలోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అప్పుడు బార్డ్‌కి యాక్సస్ పొందాలంటే.. వెయిట్‌లిస్ట్‌లో సైన్ అప్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు, AI-ఆధారిత చాట్‌బాట్ భారత్ సహా 180 కన్నా ఎక్కువ దేశాల్లోని వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చింది. ఇకపై వెయిట్‌లిస్ట్ ఉండదు. ఎవరైనా ఈజీగా బార్డ్ ఏఐని యాక్సస్ చేసుకోవచ్చు. బార్డ్ ఏఐ ఇప్పుడు టెక్ దిగ్గజం కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాంగ్వేజ్ మోడల్, (PalM 2) ద్వారా రన్ అవుతుందని Google I/O ఈవెంట్ సందర్భంగా గూగుల్ వెల్లడించింది. భవిష్యత్తులో, బార్డ్ ఏఐ కొన్ని ప్రధాన అప్డేట్లను కూడా పొందనుంది.