Gold and Silver Rates Today : బంగారం, వెండి రేట్లు ఏమైనా తగ్గితే కొనుక్కుందామని చూసే వారికి నిరేశే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న వీటి ధరలు శనివారం మరింత భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర శనివారం రూ.905 పెరిగి రూ.76,360కి చేరుకుంది.
చదవండి : టీం ఇండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్?
విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ..76,360గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని గమనించుకోవాలి.
చదవండి : టూరిస్టు బస్సులో మంటలు.. ఎనిమిది మంది సజీవ దహనం
ఇక శనివారం వెండి ధరలు ఆకాశాన్నంటాయి. రికార్డు స్థాయి పెరుగుదలను నమోదు చేశాయి. దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) ఈ ఒక్కరోజే రూ. రూ.4,069 పెరిగి రూ.92,449కు విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ ల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి భారీగా పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు సైతం భారీగా పెరిగాయి. శనివారం ఔన్సు స్పాట్ గోల్డ్ 38 డాలర్లు పెరిగి 2,415 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర 31.51 డాలర్లుగా ఉంది.

