కొన్ని రోజులుగా భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి పెరిగింది. వీటి ధరలు ఏవి ఎంత ఉన్నాయనేది తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర సోమవారం రూ.71,110 ఉండగా, మంగళవారం రూ.195 తగ్గి రూ.70,915కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.70,915గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర(Silver Rate) సోమవారం రూ.77,912 ఉండగా, మంగళవారం నాటికి రూ.382 పెరిగి రూ.78,294కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,263 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 11 డాలర్లు తగ్గి 2,252 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 25.29 డాలర్లుగా ఉంది.