Gold Rates : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
గురువారం భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు... శుక్రవారం భారీగా తగ్గాయి. ఏవి ఎంత తగ్గాయి? ప్రస్తుతం ఎంత రేట్ ఉన్నాయి? తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
hyderabad and visakhapatnam delhi gold rates on december 13th 2023
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర గురువారం రూ.68,885 ఉండగా, శుక్రవారం నాటికి రూ.561 తగ్గి రూ.68,324కు చేరుకుంది. గురువారం పసిడి ధర వెయ్యికి పైనే పెరగ్గా శుక్రవారం అర వెయ్యి వరకు తగ్గడం గమనార్హం.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ. 68,324గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) గురువారం రూ.77,470 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1820 తగ్గి రూ.75,650కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం ఇటీవల కాలంలో ఇదే కావడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు సైతం భారీగా తగ్గాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2203 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 29 డాలర్లు తగ్గి 2174 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.58 డాలర్లుగా ఉంది.