»Disney Hotstar Ott Lost Millions Of Subscribers With Jio Effect After Losing Ipl Rights
Jio Cinema: జియో సినిమా దెబ్బకు డిస్నీ హాట్స్టార్ విలవిల..4 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఔట్
భారత వ్యాపార దిగ్గజం అంబానీ రిలయన్స్ జియో(reliance jio)ను దేశంలో తీసుకురావటం పెద్ద విప్లవానికి నాంది పలికింది. ఒకప్పుడు రూ.10 రీఛార్జ్(Recharge) చేసేందుకు వంద సార్లు ఆలోచించిన భారతీయులు ఇప్పుడు వందల రూపాయలతో నెలవారీ ప్యాకేజీలు కొనుగోలు చేస్తున్నారు.
Jio Cinema: భారత వ్యాపార దిగ్గజం అంబానీ రిలయన్స్ జియో(reliance jio)ను దేశంలో తీసుకురావటం పెద్ద విప్లవానికి నాంది పలికింది. ఒకప్పుడు రూ.10 రీఛార్జ్(Recharge) చేసేందుకు వంద సార్లు ఆలోచించిన భారతీయులు ఇప్పుడు వందల రూపాయలతో నెలవారీ ప్యాకేజీలు కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా ముఖేష్(mukhesh ambani) వేసిన పెనిట్రేటింగ్ వ్యూహంతోనే సాధ్యమైంది. అసలేంటి ఈ వ్యూహం.. ఉచితం అంటే భారతీయులు అసలు వెనక్కి తగ్గరు. అలాంటిది ఏకంగా ఏడాది పాటు ఉచిత కాల్స్(free calls), ఇంటర్నెట్(internet), మెసేజ్ లు వంటి వాటిని యువతకు ఎరగా వేసి మెుత్తం దేశంలోని టెలికాం రంగాన్నే రిలయన్స్ జియో అనతి కాలంలోనే మార్చేసింది. ఇప్పుడు ఇదే మార్గాన్ని కంపెనీ ఐపీఎల్ ప్రసారాల విషయంలోనూ ప్రవేశపెడుతోంది.
రిలయన్స్ గ్రూప్ కు చెందిన వయాకామ్-18(Viacom 18) దేశంలో ఐపీఎల్(IPL 2023) ప్రసారాలకు సంబంధించిన రైట్స్ దక్కించుకుంది. జియో సినిమా ద్వారా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్(Cricket Match) లను ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు కొద్ది కాలం కిందట రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. దీంతో అమెరికాకు చెందిన డిస్నీ+హాట్ స్టార్(Disney+ Hotstar) పతనం మెుదలైంది. ఐపీఎల్ ప్రసారాల హక్కులను దక్కించుకోవటంలో విఫలమైన హాట్ స్టార్ ఇప్పుడు సబ్ స్క్రైబర్లను కూడా భారీగా కోల్పోతోంది. కేవలం మూడు నెలల్లో, స్ట్రీమింగ్ దిగ్గజం 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్(subscriber)లను కోల్పోయింది. అక్టోబర్ 2022 నుంచి ఏకంగా 8.4 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. నిపుణుల అంచనాల ప్రకారం కంపెనీ దాదాపుగా 30-40 శాతం సబ్ స్క్రైబర్లను కోల్పోవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 2022 చివరి నాటికి కంపెనీ మెుత్తంగా 61.3 మిలియన్ల మంది ఖాతాదారులను కలిగి ఉంది. అయితే డిసెంబర్ చివరినాటికి వీరిలో 6 శాతం మందిని కోల్పోయి 57.5 మిలియన్ల యూజర్లను ప్రస్తుతం కలిగి ఉంది. రిలయన్స్ జియో దెబ్బే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇండియాలో స్ట్రీమింగ్ దిగ్గజంగా జియోసినిమా(jio cinema) ఎదగాలని అనుకుంటోంది. అందుకోసం వేగంగా పావులు కదుపుతోంది. 2023 తొలి మూడు నెలల్లోనే జియోసినిమాకు 10 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను పొందింది. రిలయన్స్ గ్రూప్.. అంబానీ నిర్వహణలోని వయాకామ్-18 ఐపీఎల్ హక్కులను 2023 నుంచి 2027 వరకు కాలానికి దక్కించుకుంది. దీని ద్వారా మెుత్తం 523 మిలియన్ల మంచి ఓటీటీ ద్వారా వీక్షిస్తారని అంచనాలు ఉన్నాయి. అయితే రిలయన్స్ మాత్రం ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా తమ జియో సినిమా ప్లాట్ ఫారమ్ ద్వారా చూసేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు తెలిపి పెద్ద సంచలనానికి దారితీసింది. అందుకే వేగంగా డిస్నీ+హాట్ స్టార్ తన ఖాతాదారులను కోల్పోతోంది. డిస్నీ ప్రపంచంలో నెట్ ఫ్లిక్స్ తర్వాత రెండవ అతిపెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్న కంపెనీగా ఉంది.