LIC షేరు విలువ ఇవాళ్టి ట్రేడింగ్లో ఒక్కసారిగా 50 శాతం క్షీణించి రూ.417 వద్దకు చేరింది. అయితే ఇది మార్కెట్ పతనం కాదు, కంపెనీ ప్రకటించిన 1:1 బోనస్ షేర్ల సర్దుబాటు వల్ల జరిగింది. గతంలో రూ.830గా ఉన్న షేరు ధర బోనస్ ప్రక్రియతో సగమైంది. అసలు విషయం తెలియని ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని, కేవలం ఒక శాతం లోపే నష్టం నమోదైందని నిపుణులు చెబుతున్నారు.