హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,580 పెరిగి రూ.1,57,640లకు చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,450 పెరిగి రూ.1,44,500గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.