TG: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్న్యూస్ చెప్పింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని, గడువులోగా అభ్యర్థులు తమ వివరాలు సమర్పించాలని టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత తెలిపారు. కాగా, మార్చి 25 వరకే గడువు ఉండగా.. మరోసారి పొడిగించారు.