ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు షాక్ తగిలింది. RCBతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో పాండ్యాకు IPL గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది. ఈ సీజన్లో ముంబై జట్టుకు ఇదే మొదటి తప్పిదం కావడంతో పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.