ADB: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని టెంబి పంచాయతీ పరిధిలో గల చిన్నమీయ తాండ గ్రామంలో దంగర్ రాజు తన పంట చేలలో సాగు చేస్తున్న 60 గంజాయి మొక్కలను పట్టుకున్నామని ఎస్సై అప్పారావ్ తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దంగర్ రాజుపై కేసు నమోదు చేసుకుని, రిమాండ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.